భేటీ బచావో భేటీ పడావో..
:బాలిక విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యం.
:సూర్యాపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ ఎం.చైతన్య
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 21:18 సంవత్సరాల లోపు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ఫోక్సా కేసు మోపబడుతుంది దీని వలన భవిష్యత్తు ఇబ్బందికరంగా తయారవుతుందని అందరూ గుర్తుంచుకొని ప్రవర్తించాలని ఎం చైతన్య అన్నారు.బుధవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో భేటీ బచావో భేటీ పడావో బాలికల భవిష్యత్తు సంక్షేమం పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ ఎం చైతన్య మాట్లాడినారు.
బాలికలు తల్లిదండ్రులను గౌరవించాలని,చెడు స్నేహాలు చేయకూడదని,వాటిని గుర్తించాలని,బాలిక విద్య ద్వారానే మహిళా సాధికారిక సాధ్యమవుతుందని అవగాహన కార్యక్రమంలో మాట్లాడి వివరించినారు.ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.