మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో పట్టిపీడిస్తున్న విష జ్వరాలు.
:డ్రైన్ లలో చెత్త,పిచ్చి మొక్కలు తీయడంలో మున్సిపల్ సిబ్బంది అలసత్వం.
:ప్రజలే ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు దోమల మందు పిచికారి చేసుకుంటున్నారు.
:దోమల మందు పిచికారి చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 22:మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజలు విష జ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేటు హాస్పిటల్ లలో పేషెంట్లు కితకితలు ఆడుతున్నారు.జ్వరం వచ్చి ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్తే మినిమం 50 నుండి 60 వేల ఖర్చు అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాడుతున్నారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో దోమల మందు పిచికారీ చేయడానికి సంబంధించిన మిషనరీ అంతా ఉన్న మున్సిపల్ అధికారులు మాత్రం పూర్తిగా విఫలం చెందారని ప్రజలు వాపోతున్నారు.

విష జ్వరాలతో తట్టుకోలేక ప్రజలే స్వయంగా వారి ప్రాంతాలలో దోమల మందు పిచికారి చేసుకుంటున్నామని స్థానిక నాలుగో వార్డ్ లోని ముస్లిం బజార్ లో వారే దోమల మందు పిచికారి చేసుకొని మున్సిపల్ అధికారులకు కళ్ళు తెరిచేలా చేస్తున్నామని ప్రజలు అంటున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దోమల మందు పిచికారి చేయాలని మరియు డ్రైన్ లలో చెత్త,పిచ్చి మొక్కలు తొలగించి ఈ జ్వరాల బారి నుండి ప్రజలను కాపాడాలని పలువురు వాపోతున్నారు.