పెండింగ్ స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
:సూర్యాపేట జిల్లా కేంద్రంలో కదం తొక్కిన విద్యార్ధి లోకం..
:పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి.
:పిడిఎస్ యు డివిజన్ ప్రధాన కార్యదర్శిపిడమర్తి భరత్
Mbmtelugunews//సూర్యాపేట,ఆగష్టు 23:విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 100 ఫీట్ల రోడ్డు నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు.ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి,డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.అదే విధంగా పెండింగ్ స్కాలర్షిప్,ఫీజు దీయింబర్స్మెంట్ సుమారు రూ.8300 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆరోపించారు.దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు తగినన్ని నిధులు కేటాయించకపో వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఏర్పాటు చేయాలి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ,మహిళా డిగ్రీ,యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి,అని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఉన్న స్కాలర్షిప్ ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ
కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు కాలేజీ విద్యార్థులు,మమత,సంధ్య,నవ్య,శైలజ,వనజ,శివ,సందీప్,మహేష్,నవీను,వినయ్, వేణు,సాయిరాం, ఉదయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.