చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
- తొలి నాన్ క్రికెటర్గా ..!
Mbmtelugunews//స్పోర్ట్స్, ఆగష్టు 24:భారత స్టార్ జావెలియన్ త్రోయర్,గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన తొలి భారత నాన్ క్రికెటర్గా నిలిచాడు.టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన నీరజ్ చోప్రా..ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించాడు. దాంతో నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది.భారత్లో క్రికెటర్ల తర్వాత అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుడిగా కూడా నీరజ్ చోప్రా తెలిపాడు. ఓ బిజినెస్ వెబ్సైట్ లెక్కల ప్రకారం నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 330 కోట్లు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ రూ.87 కోట్లు పెరగడం విశేషం.ఈ క్రమంలో అతను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు.పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్..బ్రాండ్ వాల్యూ కూడా బాగానే పెరిగింది.ఇప్పటికే ఆమెను 40 సంస్థలు తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకునేందుకు అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.ఒలింపిక్స్ ముందు ఒక ఎండార్స్మెంట్కు ఏడాదికి రూ.25 లక్షలు తీసుకునే మను భాకర్..ప్రస్తుతం రూ. 1.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం భారత్ లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడాకారుడిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు.ప్రస్తుతం అతని బ్రాండ్ వాల్యూ 227.9 మిలియన్ డాలర్లుగా ఉంది.కోహ్లి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ 95.8 మిలియన్ డాలర్లు, సచిన్ టెండూల్కర్ 91.3 మిలియన్ డాలర్లు,రోహిత్ శర్మ రూ.41 మిలియన్ డాలర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు.