గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి
:ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు.
Mbmtelugunews// మణుగూరు, ఆగష్టు 25:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గనుల సమీపంలో బెల్ట్ షాపులు కార్మికులను రారమ్మని ఆకర్షిస్తున్నాయని తద్వారా ప్రమాదాలకు కారణ భూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు సింగరేణి మణుగూరు ఏరియా ఎస్ఓటు జిఎం డి శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు బాబురావు విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా మైన్స్ కు దగ్గర్లో అనేక బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు.మూడు ఫుల్లులు ఆరు హాఫూలుగా వర్ధిల్లుతున్నాయని అట్టి బెల్ట్ షాపులకు ఎలాంటి అనుమతులు లేవని సమాచార హక్కు చట్టం ద్వారా తను అడిగిన జవాబుగా ఎక్సైజ్ విభాగం అధికారులు రాతపూర్వకంగా తెలిపారన్నారు.ఇది ఇలా ఉండగా ఈ బెల్ట్ షాపులు గనులకు దగ్గరలో ఉండటంతో పలువురు కార్మికులు మద్యానికి బానిసలు అవుతున్నారు.మరి కొంతమంది ప్రమాదాలకు కూడా గురికావడానికి కారణం అవుతున్నారు అందుకు ఇటీవల సంచలనం సృష్టించిన కూనవరం లో ఆటోను ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలు కావటం,రెండు రోజుల క్రితం కూనవరం గేటు వద్ద వోల్వో డ్రైవర్ ను కారు ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ మద్యం మొత్తం డ్రైవింగ్ చేయటం లాంటి సంఘటనలో దేహశుద్ధి ,”మద్యం మత్తులో సింగరేణి కార్మికుల ప్రమాదాలు”కొంతమంది చేస్తున్న ఇలాంటి సంఘటనల మూలంగా సింగరేణి ఉద్యోగులందరికీ చెడ్డ పేరు వస్తున్నదని దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మద్యానికి బానిసలైన కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రమాదాలకు కారణం అవుతున్న మల్లారం గేటు వద్ద నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను బంద్ పెట్టే విధంగా ఎక్సైజ్,పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు కర్నె బాబురావు తెలిపారు.స్థానిక అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నట్లు బాబురావు తెలిపారు.ఎస్ఓటు జిఎం కూడా సానుకూలంగా స్పందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.



