పెన్షన్ అంగడి సరుకు కాదు .
కొనుక్కునే పెన్షన్ మాకొద్దు……..
:కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని మేము ఒప్పుకోము…
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 25:కొనుక్కునే పెన్షన్ మాకు వద్దు అని,కేంద్ర మంత్రిమండలి ఉద్యోగుల కోసం తీసుకున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని తాము ఒప్పుకునేది లేదని టీఎస్ సీపీఎస్ఈ యు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు ఆదివారంనాడు కోదాడలో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.పెన్షన్ అనేది అంగడి సరుకు కాదని ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు.పెన్షన్ పై కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వలన ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.కచ్చితంగా 1970 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి పాత విధానంలోనే పెన్షన్ నిర్ణయం జరగాలని,ప్రభుత్వ ఉద్యోగి తన నెల జీతం కాంట్రిబ్యూషన్ తో సర్వీస్ కాలంలో 50%జమ చేస్తే 20% తీసుకొని 30% తిరిగి ఇస్తుందా అని ప్రశ్నించారు.ఏ ఫండ్ లో అయినా పెట్టిన పెట్టుబడికి 25 సంవత్సరాల కాలంలో 20% నష్టంతో ఇస్తారా ? దీనిని తెలిసి ఉద్యోగులు పెట్టుబడి ఏ విధంగా పెడతారు,దీనిని కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరారు.పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు జీవన విధానం భద్రతకు,భరోసా కు పాత పెన్షన్ విధానమే ఏకైక పరిష్కారం అన్నారు.కేంద్ర క్యాబి నెట్ నిర్ణయం ఏకీ కృత పెన్షన్ విధానంలోకి వెళ్లకుండా,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి,పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు అమలు చేయాలని కోరారు.