ప్రభుత్వ వెనుకబడి తరగతుల కాలేజీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శన…..
:విద్యార్థులతో పాటు భోజనం చేసిన జిల్లా కలెక్టర్….
:వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…..
:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…..
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 26:మంగళవారం రాత్రి కోదాడలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కాలేజీ బాలురు హాస్టల్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.హాస్టల్లోని ఆఫీస్ రూమ్,రికార్డులను,స్టోర్ రూమ్,కిరణా సామాగ్రి,కూరగాయలు పరిశీలించారు.మెనూ ప్రకారం ఈరోజు తయారుచేసిన కూరలు ఎగ్ కర్రీ,సాంబార్ లను కలెక్టర్ పరిశీలించి రుచి చూశారు.అనంతరం హాస్టల్లోని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు,హాస్టల్ నందు ఉన్న విద్యార్థులలో ఇతర ప్రాంతాలు,జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు ఎందరూ ఉన్నారో ఆరా తీశారు అనంతరం కాలేజీలో జరుగుతున్న ఉద్యోబోధన గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
తరువాత జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,కూరగాయ మొక్కలు,పూల మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ ముందుగా కోర్టు నిర్మాణం కొరకు కేటాయించిన ఎన్ఎస్పి ల్యాండ్లను పరిశీలించి పలు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డిఓ సూర్యనారాయణ,తాసిల్దార్ సూరయ్య,డిప్యూటీ తాసిల్దార్ మాషా నాయక్,సర్వేయర్ నాగార్జున,బీసీ హాస్టల్ వార్డెన్ సైదులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.