అన్ని దానాల కన్నా గొప్ప దానం రక్తదానం
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 28:ప్రతినిధి మాతంగి సురేష్:అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని ఎంబిఎం ట్రస్టు సభ్యులు అన్నారు.శనివారం కోదాడ కార్తికేయ హాస్పిటల్ లో కోట సిరి ఆజాద్ నగర్ కోదాడ వారికి అత్యవసర ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన కోదాడ కొమరబండ కు చెందిన గుంజ అఖిల్ వారికి బ్లడ్ ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తం అందించడానికి సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.బ్లడ్ ఇచ్చిన వారికి ఎంబిఎం ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటివరకు ఈ ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.