హైదరాబాద్ లో కాల్పుల కలకలం
Mbmtelugunews//హైదరాబాద్, ఆగష్టు 28:గాజులరామారంలో కాల్పుల కలకలం రేపాయి.ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బైక్ లో పెట్రోల్ దొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నించగా..రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో అతనిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్పులు
జరిపారు.అనంతరం దుండగులు
పారిపోయినట్లు సమాచారం.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు
ప్రారంభించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.