నేరాలను కట్టడి చేయాలంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష పడాలి :సీతక్క
Mbmtelugunews//హైదరాబాద్,29:ప్రస్తుతం హైడ్రాపై ఎలా చర్చ జరుగుతుందో.. మహిళల భద్రతపై అంతలా చర్చ జరగాలన్నారు మంత్రి సీతక్క. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష పడాలన్నారు. నేరాలు జరగకుండా ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే తరగతి గదుల నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలన్నారు సీతక్క.
మాదక ద్రవ్యాల ప్రభావం హత్యలకు కారణం అవుతోందన్నారు సీతక్క. పని ప్రదేశాల్లో మహిళలు క్షేమంగా ఉండాలని చెప్పారు. కోల్ కతా మహిళా డాక్టర్ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిందన్నారు. ఎక్కడైనా ఎవరిపైనా ఏ ఘటన జరిగినా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు.విమెన్ సేఫ్టీ వింగ్ తో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి నేరాల కంట్రోల్ కు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లో చట్టాల గురించి తెలియజేసేలా కృషి చేస్తామన్నారు సీతక్క.