కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల పుట్టినరోజు వేడుక
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 28 ప్రతినిధి మాతంగి సురేష్:చారిత్రాత్మక కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల వ్యవస్థాపక దినోత్సవానికి సభాధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ చందా అప్పారావు ఆధ్వర్యంలో కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ తెలుగు అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు హాజరై కళాశాలను,విద్యార్థులను గురించి మాట్లాడారు.విద్యార్థులు మంచి పుస్తకాలను చదివే అలవాటును కలిగి ఉండాలని సూచించారు.జీవితపు విలువలు గుర్తుఎరిగి ఆకాశమంత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ చందా అప్పారావు మాట్లాడుతూ కెఆర్ఆర్ కళాశాలలో చదువుకున్న నలుగురికి ఇదే కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసే ఎంతో అరుదైన అవకాశాన్ని కల్పించిన ఘనత కెఆర్ఆర్ కళాశాలకు దక్కిందని అన్నారు.ఈ సందర్భంగా నాకు విద్య నేర్పి ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రోత్సహించిన మన గురువులందరినీ పేరుపేరునా కొనియాడా.ఈ సందర్భంగా 56 వసంతాల ఘన కీర్తి కలిగిన కళాశాల ఏర్పాటుకు భూమిని ఇచ్చిన కొండపల్లి రాఘవమ్మ రంగారావు చిత్రపటాలకు ముఖ్య అతిథి శ్రీరామ కవచం వెంకటేశ్వరుని పూలమాలతో సత్కరించారు.జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చందు జయంతిని జరిపినారు.తెలుగు భాషా దినోత్సవం “సందర్భంగా “తెలుగు మన వెలుగు” అని ప్రజల భాషకు పట్టం కట్టిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని కళాశాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల రిటైర్డ్ గ్రంథపాలకులు శర్మ,ఎయిర్ ఫోర్స్ అధికారి కనకారావు,కళాశాల అధ్యాపకులు సైదులు,సత్యవాణి,శ్రీదేవి,డా, నిర్మల కుమారి,వివి రెడ్డి,ఫ్రాన్సిస్,రాజు,రఫీ,సైదులు,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.