తేజ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 28 ప్రతినిధి మాతంగి సురేష్:హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినమును భారతదేశం క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తుంది.దీనిని పురస్కరించుకొని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు యాజమాన్యం క్రీడా పోటీలు నిర్వహించారు.సందర్భంగా మున్సిపల్ అప్పారావు మాట్లాడుతూ ఈ క్రీడల వలన విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని పొంది,ఒత్తిడి నుండి బయటపడి,చదువు మీద మనసును కేంద్రీకరిస్తారని తెలిపారు.క్రీడలను పాఠ్యాంశంలో భాగంగా కరికులం తయారు చేసుకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు.ఆగస్టు 29న భారత ప్రజలు ముఖ్యంగా పాఠశాలలు,కళాశాలలు,విశ్వవిద్యాలయాలు క్రీడా దినోత్సవంను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.అనంతరం ధ్యాన్ చందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ ఇంచార్జ్ ఝాన్సీ,హై స్కూల్ ఇన్చార్జ్ వి రామ్మూర్తి,గణేష్,రాంబాబు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.