వార్డుల వారిగా ఓటర్లు జాబితాను సిద్ధం చేయాలి
:రిజిస్ట్రేషన్ సమయంలో రైతుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయవద్దు:కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
Mbmtelugunews//చిలుకూరు,ఆగష్టు 28:చిలుకూరు మండలంలోని తహసీల్దార్,మండల పరిషత్ కార్యాలయాలను గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఎంపీడీవో కార్యాలయంలో ఓటర్లు జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు.నిబందనల ప్రకారం వార్డుల వారిగా ఓటర్లు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టేషన్ గధిని పరిశీలించి రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యాలయం దగ్గర ఉన్న సీత్లాతండకు చెందిన ఒక రైతు తమ భూసమస్య ఉన్నదని కలెక్టర్ కు తెలియజేయడంతో తక్షణమే రైతు సమస్య పరిష్కారం చేయాలని తహసీల్దార్ కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గిరిబాబు,తహసీల్దార్ ధృవకుమార్,డిప్యూటీ తహసీల్దార్ కరుణ శ్రీ,తహసీల్దార్,మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.