ప్రతి కమ్యూనిష్టు దొడ్డా సక్కుబాయమ్మను ఆదర్శంగా తీసుకోవాలి:ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Mbmtelugunews//చిలుకూరు,ఆగష్టు28:ప్రముఖ స్వాంత్రత్య సమరయోధుడు సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు సతీమణి దొడ్డా సక్కుబాయమ్మ ఆదర్శప్రాయురాలు అని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్త గూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు అన్నారు.గురువారం చిలుకూరులో జరిగిన దొడ్డా సక్కుబాయమ్మ సంస్మరణ సభలో మాట్లాడారు. సక్కుబాయమ్మ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి కమ్యూనిష్టు నాయకుడు ఆమే ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.ఆమే మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.కమ్యూనిష్టు పార్టీకి దొడ్డా కుటుంభం చేసిన సేవలు మరవలేవని అన్నారు.వారి కుటుంభంకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావెళ్ల నాగేశ్వరరావు, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి,పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు,సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్,ఖమ్మం,సూర్యపేట, నల్గొండ సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్,బెజవాడ వెంకటేశ్వర్లు,నెల్లికంటి సత్యం,సీపీఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.