గుర్తుతెలియని వ్యక్తులు వరి నారుమడిపై గడ్డి మంధు పిచికారి
Mbmtelugunews//చిలుకూరు,ఆగష్టు 28:గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో వరి నారుమడి పై గడ్డి మందు పిచికారి చేసి నారుమడి పనికి రాకుండా చేసిన సంఘటన గురువారం వెలుగులోనికి వచ్చింది.రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామంకు చెందిన రైతు కొండా చిన్న వీరబద్రయ్యకు చెందిన నారుమడిలో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికార చేశారు.దీని వల్లన నారుమడి దెబ్బతిని ఎండిపోతుందని బాదిత రైతు తెలిపారు.శుక్రవారం నాటు వేయాల్సిన 8 ఎకరాల నారుమడికి గడ్డి మందు కొట్టినారని తెలిపారు.నష్ట పరిచిన వ్యక్తులను పట్టుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాదిత రైతు పోలీస్టే స్టేషన్ లో ఫిర్యాధు చేశారు.