Wednesday, December 24, 2025
[t4b-ticker]

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు.

:జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భేటీ.

:తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి

Mbmtelugunews//హుజూర్ నగర్,ఆగష్టు 28:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు,హెల్త్ కార్డుల మంజూరి ప్రక్రియను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లో రహదారి బంగ్లాలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐఅండ్ పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో మూడు దఫాలుగా చర్చలు జరిపామని చర్చలో భాగంగా ఒక హైపవర్ కమిటీ ఇన్ ఏర్పాటుచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రూట్ క్లియర్ చేసినట్టు వెల్లడించారు.సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి తో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఇండ్ల స్థలాలు,హెల్త్ కార్డులు,అక్రిడేషన్ కార్డుల మంజూరి విషయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుత అక్రిడేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా 25వేల పైచిలుకు ఉన్నట్లు తెలిపారు.సెప్టెంబర్ నెలాఖరు వరకు అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఉన్నందున ఈలోపు నూతన అక్రిడేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక అక్రిడేషన్లు ఉన్నట్లు తెలిపారు.హైదరాబాద్ జర్నలిస్ట్ సొసైటీ 70 ఎకరాల స్థలం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పట్ల నిబద్ధత గా ప్రభుత్వం ఉందన్నారు.పట్టణంలో నీ రహదారి బంగ్లాలో ఆయనకు ఘనస్వాగతం పలికి మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా హుజూర్ నగర్ విచ్చేసిన కే శ్రీనివాస్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలో శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు.అనంతరం హుజూర్ నగర్ లో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు పెద్ద కుమార్తె కోల ఉదయభాను ఫోటు ఉపేందర్ లకు ఇటీవల వివాహం జరగగా ఆ దంపతులను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆశీర్వదించారు.ఈ సమావేశంలో ఎన్ నరేందర్ రెడ్డి,బసవోజు శ్రీనివాసచారి,షేక్ జాన్ బాషా,దేవరo వెంకటరెడ్డి,ఇందిరాల రామకృష్ణ,ఇట్టిమల్ల రామకృష్ణ,కోమరాజు అంజయ్య,షేక్ నాగుల్ మీరా,బాదే రాము,మల్లం వెంకటేశ్వర్లు,ఆత్కూరు వెంకటేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular