Monday, December 23, 2024
[t4b-ticker]

పశుపోషకులకు దొడ్డినిండా ఆడదూడలే పుట్టే మహదావకాశం

- Advertisment -spot_img

పశుపోషకులకు దొడ్డినిండా ఆడదూడలే పుట్టే మహదావకాశం

:ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో నూతన సదుపాయం.

:వేరుపరచిన పశువీర్యం ఉపయోగించుకుంటే దొడ్డిలో పుట్టే ప్రతీ దూడ ఇక రేపటి పాడి గేదే:అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య.

Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 30:కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఇకనుండి పశువుల కృత్రిమ గర్భధారణకు ఆడదూడల పుట్టుకకు వేరుపరచిన విర్యనాళికల వాడకం అందుబాటులోకి తేవడం జరిగింది అని అది తొలిగా కోదాడకి చెందిన బచ్చలికూర వెంకటేశ్వర్లు అనే పశుపోషకుని తొలిచూలు గేదెపడ్డకి ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో కృత్రిమ గర్భధారణ కొరకు సెక్స్ సార్టెడ్ సెమెన్ ఉపయోగించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య తెలిపారు.ఒక మోతాదు విర్యనాళిక ఖరీదు 1000 రూపాయలు కాగా అందులో 75 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోను రైతు వాటాగా 250 రూపాయలు మాత్రమే చెల్లించాలి.ఒక పశువుకి రెండు ఎదల్లో రెండు మోతాదుల వీర్యం ఇచ్చినా సుడి నిలవకపోతే రైతు చెల్లించిన రూపాయలు 500 తిరిగి క్యాష్ బ్యాక్ పద్దతితో రైతు ఖాతాకి చెల్లించడం జరుగుతుంది.ఒకవేళ సూడి నిలిచి మగదూడ పుట్టినట్లైతే రైతుకి 250 రూపాయలు తిరిగి చెల్లించడం జరుగుతుంది.వేరుపరచిన విర్యాణాలికల( సెక్స్ సార్టెడ్ సెమెన్) వాడకం,సూడి నిర్ధారణ దూడల పుట్టుక,సందర్భాన్ని బట్టి క్యాష్ బ్యాక్ విధానం పెరుగుదల వాటి యాజమాన్యం మొదలగు పర్యవేక్షణమొత్తం అంతర్జాల అప్ ద్వారా పరిశీలించడం జరుగుతుంది.పశువుల్లో కృత్రిమ గర్భధారణ కోసం తొలుత మేలుజాతి పశువుల వీర్యం సేకరించి మన దేశవాళీ నాటు పశువులకు ఇవ్వడం ద్వారా సంకరజాతి పశువుల్ని అభివృద్ధి చేస్తూ వచ్చాము.ఇప్పుడు ఆ ప్రక్రియపూర్తికావడం జరిగింది కానీ ఈ పద్దతితో పుట్టే దూడలు సగం మగ సగం ఆడ పుట్టడం పుట్టే దూడ ఆడో మగో తెలియకపోవడం వలన మగ దూడలు పుడితే రైతుకు లాభదాయకం కానందున మునుముందు పశుపోషకులకు పశుపోషణ మరింత లాభదాయకం చేయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడకం మొదలు పెట్టడం జరిగింది.ఈ పద్ధతిలో మగ లక్షణాలను కలిగిన సెక్స్ క్రోమోజోమ్స్ వేరుచేసిన వైర్యం వాడకం వల్ల వీనూటికి 90 శాతం ఆడదూడలే పుడతాయి.ఇలా పశుపోషకుల లోగిల్లో పశువులకు ఆడదుడలే పుట్టడం వల్ల నమ్మదగిన మేలుజాతి,పశువు పూర్వ వంశ చరిత్ర తెలిసిన నాణ్యమైన పాడి పశువులు అభివృద్ధి చెందుతాయి.అందుకోసమే పశువులకు మరింత మేలు కలిగి పశుపోషణ లాభసాటిగా సాగి పాడి సమృద్దిగా పెరిగి పోషకులకు వినియోగదారులకు ఆరోగ్యమైన పాలు పాల ఉత్పత్తులు అందించడానికి ఈ విధానం ఉపయోగించడం జరుగుతుంది.ఈ వీర్య నాలికలు ఎదకు వచ్చిన పశువులకు వైద్యశాలలో పశుపోషకుల ఇంటివద్ద కూడా వాడే సౌకర్యం ఉంది అలాగే ఎదకు రాని పశువులకి 10 లేదా పదిహేను పశువులున్న వారి పశువులకి ఏకకాలంలో కోరుకున్న సమయంలో ఎదకు రావడానికి హార్మోన్ వాడకంతో కృత్రిమంగా ఎదకు రప్పించి కూడా గర్భధారాణ చేయబడును తద్వారా రైతులకు విలువైన సమయం కలిసి వచ్చి పాడికాలం ఎక్కువగా వృద్దియవుతుంది.పశుపోషకులు తమపశువులకి బహువిధప్రయోజనాలున్న ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వినియోగించుకొని తమ పశుసంపదను మరింతవృద్ధిచేసుకొని లబ్ధిపొందాల్సిందిగా తెలియజేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular