సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం,నిరసన ర్యాలీ విజయవంతం చేయాలి…..
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 30:ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ తర్వాత పొందే పెన్షన్ కు భద్రత భరోసా ఇవ్వని నూతన పెన్షన్ విధానం సిపిఎస్ వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా,నిరసన ప్రదర్శన ను సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఎస్సిపిఎస్ఇయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోకోదాడలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం లో మాట్లాడినారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు,మ్యానుఫ్యాస్టో లో చెప్పిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో సిపిఎస్ కమిటీ కోదాడ డివిజన్ బాధ్యులు పిడమర్తి అంకులయ్య,రామినేని సతీష్,ముక్కామల జానకిరామ్,మల్లేపల్లి శేఖర్,కాండూరి కరుణాకర్ పాల్గొన్నారు.