ఖైరతాబాద్ గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నావి:ఎమ్మెల్యే దానం నాగేందర్
Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 30:ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకుంటారని… వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు.భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండబోతుందని తెలిపారు.హిమాయత్ నగర్ డివిజన్ లోని అవంతి నగర్,ముత్యాలమ్మ బస్తీ లో 1 కోటి 60 లక్షల అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాలలో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు దానం తెలిపారు. నిర్వాహకులు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు… ముస్లిం మత పెద్దలు మిలాద్ ఉన్ నబీ ను 19 న నిర్వహిస్తామని తెలపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు.అలాగే విషజ్వరాలు విజృంభిస్తున్న నేపధ్యంలో,పారిశుద్ధ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని,దోమలు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.