రజనీకాంత్ ‘కూలీ’లో శృతి హాసన్..
Mbmtelugunews//సినిమా, ఆగష్టు 31:సూపర్ స్టార్ రజనీకాంత్,తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబి నేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. సన్పిక్చర్స్ బ్యానర్పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా..తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా.సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించ నున్నారు.ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.అయితే ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్రను మేకర్స్ రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మలయాళ నటుడు,మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం గురువారం అక్కినేని నాగార్జున సైమన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడు మరో పాత్రను రివీల్ చేశారు.ఈ సినిమాలో తమిళ నటి శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా ప్రీతి ఫస్ట్ లుక్ను విడుదల చేసింది.