వనపర్తిలోనే మా పెళ్లి
Mbmtelugunews//సినిమా, ఆగష్టు 31:నటుడు సిద్ధార్థ్ తో ప్రేమ,పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి అదితిరావు హైదరీ.నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి కూడా ఉంటుందని చెప్పారు.’మహాసముద్రం’ షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనకు పరిచయమయ్యాడని చెప్పారు. కొంతకాలానికి మంచి స్నేహితులమయ్యాం అన్నారు.”మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం.అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదాన్ని.హైదరాబాద్ లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు.అది నాకెంతో ప్రత్యేకం.నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా.కొన్నేళ్లక్రితం ఆమె కన్నుమూశారు.ఈ విషయం సిద్ధార్థు తెలుసు.ఓ రోజు నా వద్దకువచ్చి..ఆ స్కూల్ కి తీసుకువెళ్లమని అడిగాడు.మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం.మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు.ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు” అని అదితి తెలిపారు.అతను ప్రేమను వ్యక్తపరిచిన తీరు తనకెంతో నచ్చిందన్నారు.అనంతరం ఆమె పెళ్లి వేదిక గురించి మాట్లాడుతూ.. “వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. మా నిశ్చితార్థం అక్కడే జరిగింది.పెళ్లి కూడా అక్కడే ఉంటుంది.పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం” అని అన్నారు. సిద్ధార్థ్ – అదితి ప్రేమలో ఉన్నారంటూ ఎంతోకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.ఈక్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వీరి నిశ్చితార్థం జరిగింది.రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి.దీనిపై ఇటీవల ఓ కార్యక్రమంలో సిద్ధార్థ్ స్పందించారు.”మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారు.సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.మా ఎంగేజ్మెంట్కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్ ఫంక్షన్గా భావిస్తున్నారు.నిజం చెప్పాలంటే, మాది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్.(వెడ్డింగ్ డేట్ను ఉద్దేశించి) ఇదేమీ షూటింగ్ డేట్ కాదు నేను నిర్ణయించడానికి. ఇది లైఫ్లైమ్ డేట్.పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుంది.వాళ్లు ఎప్పుడు ఏం జరగాలనుకుంటే ఆ సమయంలో అది జరుగుతుంది” అని చెప్పారు.