వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
:బాణాల కవిత నాగరాజ్ మాజీ జిల్లా పరిషత్ సంఘ సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ మరియు జెడ్పిటిసి.
Mbmtelugunews//నడిగూడెం,ఆగష్టు 31:కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి ఆదేశానుసారం
గత మూడు,నాలుగు రోజులుగా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి అని అందువలన అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని,విద్యుత్ స్తంభాలు తాకరాదని,పొలాల వద్దకు వెళ్ళినప్పుడు మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండరాదని,పురాతమైన ఇళ్లల్లో ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఎదైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని,తక్షిణమే అధికారులు వారికి కావాల్సిన సహాయ చర్యలు తీసుకుంటారని తెలిపారు.అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.నియోజకవర్గ మరియు నడిగూడెం మండలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ మరియు జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజు కోరారు. చిన్న పిల్లలను సింగిల్ గా బయటకు పంపించోద్దని కోరారు.అత్యవసరం అయితే తప్పా ఎవరు బయటకు రావద్దని కోరారు.