పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలు:సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ
Mbmtelugunews//సూర్యాపేట,ఆగష్టు 31:పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలు.*
– *శాంతి సామరస్యాలకు పాటుపడాలి*
– *మండపాల వద్ద నిబంధనలు పాటించాలి.*
– *డిజె శబ్ధాలు వద్దు – భక్తి భావంతో పండుగ జరుపుకోవాలి*
– *గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి.*
….. *సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ*
శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలి, జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ IPS గారు పిలుపునిచ్చారు. గణేష్ మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదని అన్నారు. ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని అన్నారు. గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలకు దారి వదలాలని ఎస్పీ గారు కోరినారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాలి.
https://policeportal.tspolice.gov.in/index.htm
సంభందిత అధికారులు ఆన్లైన్ అప్లికేషన్ పరిశీలించి అనుమతులు ఇస్తారు.
*పోలీసు సూచనలు*
●మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలి.
● ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యొక్క యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి.
● ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.
● భక్తులు వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
● ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు.
● విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.
● వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.
● ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయవొద్దు.
● ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలి.
● ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.
● DJ లకు, బాణాసంచా కు అనుమతి లేదు. స్పీకర్ ద్వారా నిర్ణీత సమయం రాత్రి 10 గంటల లోపు మాత్రమే సంప్రదాయ సంగీతం ప్రసారం చేయాలి. ఇతరులకు అవనించే విధంగా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి.
● నిబంధనలు పాటించాలి.