Friday, December 26, 2025
[t4b-ticker]

గంజాయి కార్యకలాపాలపై పోలీస్ ఉక్కు పాదం

గంజాయి కార్యకలాపాలపై పోలీస్ ఉక్కు పాదం

:గంజాయి విక్రయిస్తున్న 6 గురు నిందితులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీస్ లు

Mbmtelugunews//కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా,ఆగష్టు 31:కొమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈస్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్నారు అన్న సమాచారం మేరకు శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ నెంబర్ 1 గ్రామం లో తణిఖీలు చేపట్టారు.గ్రామం లోని రాజకుమార్ సర్కార్ తండ్రి సర్కార్ రాజన్ ఇంట్లో తనిఖీ చేపట్టగా అతని ఇంట్లో 55 గ్రాముల గంజాయి (విలువ 5000) లభించింది.
వివరాల్లోకి వెళ్తే ఈస్గోవ్ లోని విలేజ్ నెం 1 లో నివాసం ఉండే రాజ్ కుమార్ సర్కర్ అనే వ్యక్తి కాగాజ్నగర్,చింతగూడ మరియు బుర్దగూడ లో నివాసం ఉండే విద్యార్థులు,ఇతర యువకులకు గంజాయి నీ మహారాష్ట్ర నుండి తీసుకొని వచ్చి 5 గ్రాములు,10 గ్రాముల గంజాయి నీ చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారు చేసి వారిని ఈస్గావ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి వారికి 500/- రూపాయలు ఒక్కో పాకెట్ చొప్పున విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి అన్న నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ పక్క ప్రణాళికా తయారు చేసి రెండుటీంలను తయారు చేసి కాగజ్ నగర్ కి చెందిన యువకులు గంజాయి తీసుకోవడానికి ఈస్గావ్ కి వచ్చే సమయానికి అక్కడ ఉండి గంజాయి చేతులు మారే సమయంలో ఒక్కసారిగా వారిని పట్టుకోవడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలియచేశారు.గంజాయిని అమ్ముతున్న,కొంటున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది.పట్టుబడిన వారి వివరాలు 01). రాజ్ కుమార్ సర్కార్ తండ్రి సర్కార్ రాజన్,విలేజ్ నెంబర్ 1,ఈస్గావ్.02)బోషంలా. భీమేష్ తండ్రి లచుళ్లు,విలేజ్ మారుతి నగర్ కాలనీ,కాగజ్ నగర్.03) ఎండి అతీక్ తండ్రి రఫీక్,విలేజ్ బొరిగం విలేజ్,కాగజ్ నగర్.04) కమ్రే.కార్తీక్ తండ్రి సోమయ్య,విలేజ్ బొరిగాం,కాగజ్ నగర్.05)ఎండి ఆరీఫ్ ఉసేన్ తండ్రి చంద్ పాష,విలేజ్ పకిజా నగర్,కాగజ్ నగర్.
06)షేక్ తన్వీర్ తండ్రి నైజాం విలేజ్ నౌగాంబస్తి,కాగజ్ నగర్.

అదేవిధంగా జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలపాలకు పాల్పడినట్టు గుర్తించినట్లయితే 8712670505 కి కాల్ చేసి సమాచారం అందివ్వాలని అదేవిధంగా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.ఈ టాస్కులో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్,ఎస్సై వెంకటేష్ ,పీసీలు మధు,రమేష్ పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular