స్పీడ్ పెంచిన హైడ్రా
Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 31:నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది.ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు.శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సుడిగాలి పర్యటన చేపట్టారు.స్థానిక సాకి చెరువును పరిశీలించారు.ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్టుమెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ అపార్టుమెంట్ ను రంగనాథ్ పరిశీలించారు.స్థానికంగా ప్రవహించే నక్క వాగు భఫర్ జోన్ ఖబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాల పై స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు.ఆ నిర్మాణాలపై దృష్టి సారించి ఇరిగేషన్ అధికారులను వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.