జల దిగ్బంధంలో కూచిపూడి.
:ఉప్పొంగి పొర్లుతున్న కూచిపూడి అంతర గంగ వాగు.
:వరద ఉదృతికి కొట్టుకుపోయిన స్కూల్ బస్సు,రెండు లారీలు,డోజర్.
:కుప్పకూలిపోయిన ప్రహరీ గోడలు.
:ఇళ్లల్లోకి చేరిన నీరు ధ్వంసమైన ఫీజ్ లు,కూలర్లు,గేదెలు,మేకలు గడ్డి వాములు,వంట సామాగ్రి.
:నీట మునిగిన వందల ఎకరాలు,కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్లు,విధ్యుత్ మోటార్లు,స్థంబాలు.
:తీవ్ర ఆస్తినష్టంతో దిక్కుతోచని అయోమయస్థితిలో ప్రజలు.
:ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు.
:ప్రభుత్వం వెంటనే స్పందించి భాధితులను ఆదుకోవాలి – మాజీ సర్పంచ్,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 01:సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామం నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి జల దిగ్బంధమైంది.అంతరగంగా వాగు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోవడమే కాక ఒక స్కూల్ బస్సు,రెండు లారీలు,డోజర్ వరద ఉదృతికి కొట్టుకుపోగా ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు.సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒకే సారి వరద ప్రవాహం పెరిగి పరిసర ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రాణ భయంతో బయటకు పరుగులు తీయగా గ్రామస్థుల సహకారంతో పంచాయతీ కార్యదర్శి బృందంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆవాసం కల్పించనైనది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ వందల ఎకరాలు నీట మునిగి వందల మోటార్లు కొట్టుకుపోవడమే కాక ట్రాన్స్ ఫార్మర్లు,విధ్యుత్ స్థంబాలు,గేదెలు,మేకలు,కోళ్లు,దుకాణం సముదాయాలు,గడ్డి వాములు కొట్టుకుపోయి సుమారు 500క్వింటాల్ల బియ్యం,1000కి పై చిలుకు దాన్యం బస్తాలు నీట మునిగి కంటికి కనిపించని ఆర్ధిక నష్టం జరిగింది.
గ్రామంలోని చాలా ఇళ్ళు జల దిగ్బంధం కాగా కోతలు ఏర్పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా కాపాడే ప్రయత్నంలో సహకరించిన ఆర్డీవో కి,తహసీల్దార్ కి,పంచాయతీ కార్యదర్శికి,యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఉదయం గ్రామ యువత,పెద్దలు,పంచాయతీ సిబ్బందితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించి మనో ధైర్యం కల్పించి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చామని అన్నారు.అధికారులు వెంటనే స్పందించి భాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలనీ,గ్రామాన్ని అన్ని విధాలుగా ఆధుకోని అండగా నిలబడాలని అదేవిదంగా కూచిపూడి అంతరగంగా వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.