Monday, December 23, 2024
[t4b-ticker]

వినాయక విగ్రహాల తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisment -spot_img

వినాయక విగ్రహాల తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలి

:గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వినాయక విగ్రహాలు పనికి రాకుండా పోయాయి

:వారికి లక్షలలో నష్టం జరిగింది ప్రభుత్వం వారిని ఆదుకోవాలి

:విగ్రహాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి ఆర్థిక సహాయం అందించిన బిజెపి రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 02:గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలలో వర్షపు నీరు చేరి విగ్రహాలు పూర్తిగా పనికిరాకుండా పోయినాయి వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.కోదాడ పట్టణ పరిధిలోని సిసి రెడ్డి కాన్మెంట్ దాటిన తర్వాత రాథోడ్ రత్ని నారాయణ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో వర్షాలకు పూర్తిగా వినాయక విగ్రహాలు పనికి రాకుండా పోయిన విషయం తెలుసుకొని బిజెపి రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్ సోమవారం తయారీ కేంద్రాన్ని పరిశీలించి వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోదాడ పట్టణంలో నీరంతా సీసీ రెడ్డి కాన్మెంటు పక్కకు చేరడంతో అక్కడ రోడ్డు మీద డివైడర్లు పై నీరు పొంగిపొర్లడంతో మున్సిపల్ అధికారులు డివైడర్ ను పగలగొట్టడంతో ఒక్కసారిగా నీరు ఆ వినాయక తయారీ మండపంలోకి చేరడంతో విగ్రహాలన్నీ పనికిరాకుండా పోయాయని అన్నారు.వారికి సుమారుగా 30 లక్షల నష్టం జరిగిందని అన్నారు.వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular