నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.
:బాధితులకు ఎమ్మెల్యే పద్మావతి భరోసా.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 03:తాజాగా కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలంలోని గణపవరం పరిధిలోని గండి బ్రిడ్జి కొట్టుకపోయింది.దీనితో సుమారు 200 ఎకరాలు పైగా రైతుల పంటపొలాలు దెబ్బతిన్నాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మావతి స్వయంగా భాధిత రైతుల పంటపొలాలను పరిశీలించారు.బ్రిడ్జి కొట్టుకపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు.ప్రమాదకరంగా ఉన్న గణపవరం చెరువుకు మరమ్మత్తులు చేపట్టాలని ఇరిగేషన్ డీఈకి ఫోన్ లో ఆదేశాలు జారీచేశారు.బాధిత రైతులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించి ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి,బుర్రా సుధారాణి పుల్లారెడ్డి,ఇర్లా సీతారాంరెడ్డి,సుమన్ రెడ్డి,నారపరెడ్డి,కె సత్యం,నాగప్రసాద్,బి సత్యం,చిన్న కోటయ్య,నాగిరెడ్డి,నజీజ్,రైతులు పాల్గొన్నారు.