వర్షాల దృశ్య పారిశుద్ధ్య,హెల్త్ వారు అప్రమత్తంగా ఉండాలి:శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు
Mbmtelugunews/ఒంగోలు జిల్లా, సెప్టెంబర్ 04:మంగళవారం ఉదయం ఒంగోలు నగరంలో పార్టీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు అధ్యక్షతన మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది,పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్,డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం దృష్టిలోపెట్టుకొని అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలిని కొరడo జరిగినది.ఒంగోలు కార్పోరేషన్ లో పారిశుద్ధ్యం,శానిటేషన్ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశం ఇవ్వడం జరిగినది.వరద మొంపు లేకుండా పోతురాజు కాలువ పూడిక తీసివేతను త్వరగా పూర్తి చేయాలి అని కోరడం జరిగినది.ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత,కమీషనర్ వెంకటేశ్వరావు,డిప్యూటీ మేయర్,అధికారులు,కార్పోరేటర్లు, నగర పార్టీ నాయకులు,క్లస్టర్ ఇంచార్జీలు,టీడీపీ,జనసేన,బిజెపి నాయుకులు పాల్గొన్నడం జరిగినది…



