అన్నదానం మహాదానం:శంకరశెట్టి కోటేశ్వరరావు
Mbmtelugunewd//కోదాడ,సెప్టెంబర్ 04:మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో బుధవారం మాజీ ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంతర్ గంగా వాగు పొంగి కూచిపూడి గ్రామంలోకి అనుకోకుండా ఒక్కసారిగా వరద నీరు రావడంతో ప్రజలు చూస్తుండగానే ఇళ్లలోకి నీరు చేరడంతో ఏమి చేయలేని స్థితిలో ప్రజలు వారి ప్రాణాలను వారు కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడినారు.ఈ నీరు ఇండ్లలోకి రావడం వలన నిత్యవసరలకు సంబంధించిన వన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో వాళ్లు నానా ఇబ్బందులు పడుతుంటే వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించానన్నారు. ప్రభుత్వం తరఫున వీరిని ఆదుకోవడానికి నేను కృషి చేస్తానని అన్నారు.ఇంకా మరింతమంది దాతలు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.