నెమలిపురి ఎస్సీ గురుకుల విద్యార్థుల అవస్థలు.
:వర్షం కారణంగా విద్యుత్ లేకపోవడంతో ఆరుబయటే కాలకృత్యాలు.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 05:మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ పరిధిలోగల నెమలిపురి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల వసతి గృహ విద్యార్థులు తాగునీరు,వాడుకునే నీరు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.బుధవారం రాత్రి నుండి వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కాలనీ సమీపంలోని కాలువ వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనంకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.

కాలకృత్యాల అనంతరం ఇద్దరూ విద్యార్థులు కలిసి ఒక బకెట్ నీళ్ళు తిన్న ప్లేట్లు కడిగేందుకు పల్లె ప్రకృతి వనం నుండి హాస్టల్ వరకు కిలోమీటర్ దూరం మోసుకుంటూ వెళ్తున్నారు.ఈ వెల్ఫేర్ పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండగా మొత్తం విద్యార్థులు 532 మంది చదువుకుంటున్నారు.పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వర్షం వచ్చిన రోజు కరెంటు పోయినది.రాత్రి నుండి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిగతా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని విద్యార్థులు తెలిపారు.