ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కృష్ణారావు
mbmtelugunews//కూకట్‌పల్లి, సెప్టెంబర్ 06:వినాయక చవితి సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో వెంకట్రావు నగర్ కమ్యూనిటీ హాల్లో వినాయక మట్టి ప్రతిమలను ప్రజలకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతినీ పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకులను నీటిలో కలపడం వల్ల నీరు కలుషితం అవుతుందని దానివల్ల జలచారాలకే కాకుండా భవిష్యత్ తరాలకు ఎంతో చెడు చేసిన వాళ్ళమవుతామని.. అందువల్లనే మట్టి గణపతిని పూజించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.