కృష్ణా నది వరద ముంపు బాధితులు 400 మందికి భోజనాలు ఏర్పాటు.
:పాములంక గ్రామ ప్రజలకు కూడా ఆటోలో భోజనాలు పంపించడం జరిగింది.
:తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ కి అభినందనలు – ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
Mbmtelugunews//కృష్ణ జిల్లా, సెప్టెంబర్ 08:పామర్రు నియోజకవర్గం తోట్ల వల్లూరు లోని జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలో ఉన్న లంక గ్రామాల ప్రజలు 400 మందికి రాజేంద్రప్రసాద్ చేయించిన భోజనాలను బాధితులకు ఎమ్మెల్యే కుమార్ రాజా ఆదివారం వడ్డించి అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.ఈరోజు తోట్ల వల్లూరు హైస్కూల్లో 400 మంది లంక గ్రామాల ప్రజలకు రాజేంద్రప్రసాద్ మంచి భోజనం వండించి వారికి పెట్టడం జరిగిందని,దానికి రాజేంద్రప్రసాద్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అకాల వరదతో కృష్ణానది లంక గ్రామాల ప్రజలు గత ఐదు రోజులుగా పునరావస కేంద్రాల్లో ఉంటున్నారని,వారికి ఏ లోటు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ మానవసేవే – మాధవ సేవగా భావిస్తున్నారని,పూర్తిగా పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు ఈ ప్రజలను ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం,రాష్ట్ర బీసీ ఫెడరేషన్ల ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి,రాష్ట్ర సగర సాధికార కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్,రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,డిపిఓ నాయక్,కొండాలమ్మ తల్లి గుడి మాజీ చైర్మన్ కొండ,నెక్కలపూడి మురళీ,కోటేశ్వరరావు,మాజీ సర్పంచ్ జక్క శ్రీనివాసరావు,తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.