వినాయకుని కృపా కటాక్షాలతో సమస్త జనులందరూ సంతోషంగా ఉండాలి
:వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని
: విద్యార్థులు ఒక వినాయకుని భక్తి శ్రద్దలతో పూజించాలి
:తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్.
Mbmtelugunews//కృష్ణ జిల్లా, సెప్టెంబర్ 09:వినాయక చవితి సందర్భంగా ఉయ్యూరు లోని 15 ,16, 2,6 వ వార్డుల్లో పెట్టినటువంటి వినాయకుని విగ్రహాల వద్దకు కమిటీ వారి ఆహ్వానం మేరకు సోమవారం వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని,మనం పూజించే దేవుళ్ళలో మొట్టమొదటగా పూజించేది వినాయక స్వామినేనని,భారతదేశము మొత్తంలో అతి భారీగా చేసేటువంటి సంబరం వినాయక చవితి అని,ఆ వినాయకుని కృపాకటాక్షాలతో సమస్త జనులందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో తులతూగాలని భగవంతున్ని కోరుకున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమాల్లో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్,మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి,మాజీ ఎంపీటీసీ మోదుగమూడి కుటుంబరావు,వెంకటేశ్వరరావు,సుబ్బారావు,మల్లెల కొండ,రామనోళ్ళ శ్రీకాంత్,మురాల వెంకటేశ్వరరావు,ఆరేపల్లి నెహ్రూ,రాము,మురాల శేషగిరి,జంపాన శివయ్య,హనుమంతరావు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



