వర్షాకాలంలో గొర్రెలు,మేకల మందలకు హిమాంకాస్ కాంటర్టస్ ప్రాణాంతకమైన వ్యాధి
:పెంపకందారులు తగుజాగ్రత్తలు పాటించకుంటే మందలు కోల్పోయే ప్రమాదం:డాక్టర్ పి పెంటయ్య
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 11:నడిగూడెం మండల పరిధిలోని కాగితరామచంద్రాపురం గ్రామానికి చెందిన ఒక మేకల పెంపకం దారుడు గత వారం నుండి తన మేకపిల్లలు మృత్యువాత పడుతుండడంతో నడిగూడెం పశువైద్యాధికారి సలహామేరకు చనిపోయిన మేకపిల్లను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు రాగా అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య శవపరీక్ష నివహించి మేకలు ప్రాణాంతకమైన హిమాంకస్ అనే ఆతరపరాన్నజీవులు,బాక్టీరియా వలన ఉమ్మడి ఇన్ఫెక్షన్ తో మరణించినట్టు నిర్ధారించినారు. ఈ సందర్భంగా డా,,పి పెంటయ్య మాట్లాడుతూ జీవాల పోషకులకు మునుముందు తమ జీవాలు ఈ వ్యాధిభారిన పడకుండా వర్షాకంలో చిత్తడి నేలలు గ్రసాన్ని వెతుకోని జీవాలు మేసే క్రమములో ఈ అంతరపరాన్నజీవులు నోటిద్వారా జీవాల కడుపులోకి వెళ్లి పెద్దపేగులో నిల్వ ఉండి సంతానోత్పత్తితో వేల సంఖ్యలో తయారవుతాయి అని అన్నారు.పెద్ద పెగును పట్టి రక్తాన్ని పీల్చి జీవాల్ని నీరసానికి గురిచేస్తాయి.ఇదే అదనుగా బ్యాక్టీరియా వైరల్ క్రిములు దాడి చేసి ఇతర వ్యాధుల్ని సోకిస్తాయి.దానితో జీవాలు మేతమేయలేక నిరసించి చనిపోతాయి.నేటి మేక శవపరీక్ష ప్రకారం ఈ వ్యాధి కోదాడ పరిసర మండలాల్లో సోకి ఉంది కాబట్టి కాపరులు ఈ వ్యాధిసోకిన జీవాలు మేసిన ప్రాంతాల్లో తమ జీవాలను మేపరాదు.అలా అక్కడే మరలా జీవాల్ని మేపినట్లైతే జబ్బుసోకిన గొర్రెలు మేకలు పెట్టే పెంట ద్వారా తిరిగి అక్కడ కొత్తగా మేతకు వచ్చిన జీవాల కడుపిలోకి వెళ్లి అవికూడా జబ్బుపడి మరణిస్తాయి.పెంపకందారులు తమ జీవాలు సురక్షితంగా ఉండాలంటే జబ్బు సోకిన వాటిని ఇంటివద్దనే ఉంచి పశువైద్యాధికారిని సంప్రదించి చికిత్స అందించాలి.జబ్బుసోకిన జీవాలు తిరిగిన ప్రాంతాల్లో మందల్ని తిప్పరాదు
ఇది లేగదూడలు గేదె దూడల్లో సైతం సోకే అవకాశం ఉన్నందున వాటిని కూడా ఆ ప్రాంతాల్లో మేపరాదు.జీవాల పేడ పరీక్ష చేయించి ముందస్తు గా పరాన్నజీవుల నివారణ మందులు త్రాగించాలి.పై సూచనలు పాటిస్తూ తమ జీవాల సంరక్షణతోపాటు తోటివారి జీవాలు కూడా ఈ ప్రాణాంతక వ్యాధిభారిన పడకుండా చూసుకోవాలని సూచించారు.