ఇంట్లో పిల్లి ఎత్తుకొచ్చిన పిట్ట పిల్లను కాపాడి వైద్యం చేయించిన కోదాడ పట్టణ వాసి
మానవత్వం బ్రతికేఉందనడానికి ఒక నిదర్శనం
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 12:కోదాడ పట్టణానికి చెందిన బోట్ల సతీష్ కుమార్ అనే జంతు ప్రేమికుడు పిల్లి ఎత్తుకొచ్చిన ఒక చిన్న పిట్టపిల్లను పిల్లి బారినుండి రక్షించి వైద్యంకోసం ప్రాంతీయపశువైద్యశాలకు తీసుకు వచ్చారు.ఎగరలేని స్థితిలో ఉన్న పిట్టపిల్లను స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య పరీక్షించి చికిత్స చేసి దానికి ప్రాణాపాయం లేదని పిట్ట సంరక్షకుడికి తెలిపి అది పూర్తిగా కోలుకునే వరకు లేత ఆకు చిగురులు,కొంత గ్లూకోజ్ ఆహారంగా అందించాలని సూచించారు.రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యినా అటు చూసి ఆగకుండా వెళ్తున్న ఈ రోజుల్లో సైతం చిన్న,పెద్ద జీవి అనే తేడా లేకుండా ప్రాణం ఏదైనా ప్రాణమే అని బావించి పిట్ట పిల్ల ప్రాణాల్ని కాపాడిన జంతుప్రేమికుడి దయాగుణాన్ని పలువురు అభినందించారు.చికిత్సా కార్యక్రమములో సిబ్బంది రాజు చంద్రకళ పాల్గొన్నారు.