విజయగణపతి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
:అన్నదానంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్.
:18 వేల116 రూపాయలకు లడ్డు దక్కించుకున్న ధనలక్ష్మి అండ్ సన్ జ్యూయలరీ నిర్వహకులు.
:లక్కీ డ్రా లో 25 కేజీల లడ్డు దక్కించుకున్న క్రితిన్ భక్తుడు.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 14:కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు కనుల పండుగగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.శనివారం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్ ప్రారంభించారు.అనంతరం లక్కీ డిప్ ద్వారా స్వామివారి 25 కేజీల లడ్డును డ్రా తీయగా గెలుపొందిన క్రితిక్ అనే భక్తుడికి అందజేశారు. అదేవిధంగా స్వామివారి 12 కేజీల లడ్డును పట్టణంలోని ఓరుగంటి నారాయణ ధనలక్ష్మి అండ్ సన్స్ జువెలరీ షాప్ నిర్వాహకులు ఓరుగంటి వెంకటబ్రహ్మం,రాము,నవీన్ కుమార్,నిఖిల్ లు 18,116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు.
అనంతరం అదే లడ్డును భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ గణపతి దేవాలయం చైర్మన్ బొలిశెట్టికృష్ణయ్యను,విచ్చేసిన అతిథులను కమిటీ వారు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విజయగణపతి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు……..