వంటిపులి రమా శ్రీనివాస్ ల సహకారం అభినందనీయం…….
:వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి……..
:వరద బాధితులకు చేయూతనిద్దాం………
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్14:వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు,వంటిపులి వెంకటేశ్ లు పిలుపునిచ్చారు.శనివారం కోదాడ పట్టణంలోని 29 వ వార్డులో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆదేశాల మేరకు ఇటీవల వచ్చిన వరదలతో ఇండ్లు మునిగి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు స్థానిక కౌన్సిలర్ వంటిపులి రమా శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి నెల రోజులకు సరిపడా బియ్యం,నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని గడప,గడపకు తిరిగి బాధిత కుటుంబాలకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్ వంటిపులి రమా శ్రీనివాస్ లను ఆదర్శంగా తీసుకొని ప్రజలు తమ వంతు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా వంద కుటుంబాలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు,ఒంటిపులి వెంకటేష్,కౌన్సిలర్ వంటిపులి రమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.