గణేష్ నిమజ్జనాలను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని
:అధికారులు కేటాయించిన ఘాటుల వద్ద మాత్రమే నిమజ్జనాలు జరుపుకోవాలని
:నిమజ్జనాల సమయంలో పిల్లల రాకుండా ఉత్సవ కమిటీ వారు చూసుకోవాలి.
:నిమజ్జనాల సమయంలో సిబ్బంది జాగ్రత్తగాలు తీసుకోవాలి.
:కోదాడ పెద్ద చెరువు నిమజ్జన ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 14:గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాటును ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ఉత్సవ కమిటీ వారు నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.నిమజ్జన ఊరేగింపు సమయంలో డిజేలు పెట్టరాదు,ఘాటుల వద్దకు వెళ్లేటప్పుడు చిన్న పిల్లలను తీసుకొని వెళ్లొద్దని అన్నారు.ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా పోలీసు వారికి సహకరించాలని అన్నారు.పోటీ తత్వం లేకుండా ఒకరి తర్వాత ఒకరు ఊరేగింపులు జరుపుకోవాలని అన్నారు. అధికారులు కేటాయించిన ఘాటుల వద్దనే నిమజ్జనాలు జరుపుకోవాలని తెలిపారు.ఎవరు కూడా ఉత్సాహంతో తెలియని ప్రాంతాలకు వెళ్లి నిమజ్జనాలు జరుపుకోరాదని తెలిపారు. అనంతరం కోదాడలో పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాటును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి,ఆర్డిఓ సూర్యనారాయణ,మున్సిపల్ కమిషనర్ రమాదేవి,సిఐ రాము,పోలీస్ సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.