నవరాత్రుల సందర్భంగా అన్నదానం పుణ్యకార్యం……
:తమ్మరలో ఘనంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు…….
:కులమతాలకు అతీతంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు
:అన్నదానాన్ని ప్రారంభించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామినేని రమేష్,కమతం పుల్లయ్య
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్):గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామినేని రమేష్,కమతం పుల్లయ్యలు అన్నారు.ఆదివారం కోదాడ పట్టణం పరిధిలోని తమ్మర 4వ వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.కాగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామినేని రమేష్,కమతం పుల్లయ్యల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తమ్మరలో కులమతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఈ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నల్లూరి వెంకటేశ్వర్లు,షేక్ సద్దాం హుస్సేన్,పోటు నరేష్,బండారు వెంకటనారాయణ,షేక్ ఖాజా మియా,షేక్ యాకోబు,సిద్దెల కార్తీక్,ఇస్మాయిల్,షేక్ అజిత్,షేక్ ఫాషా,పసుపులేటి సతీష్,ముద్రబోయిన వీరబాబు,పసుపులేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు….