Saturday, July 5, 2025
[t4b-ticker]

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

:కోదాడ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమం.

:డాక్టర్ నిరంజన్
డిప్యూటీ డిఎంహెచ్ఓ

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):జిల్లా ఉప వైధ్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నిరంజన్ ఆదేశానుసారం కీటక జనీత నివారణ సబ్ యూనిట్ ఆఫీసర్ సముద్రాల సురేందర్ పర్యవేక్షణలో కోదాడ పట్టణం లో డివిజన్ పరిధిలోని వైద్య సిబ్బంది చేత
స్పెషల్ డ్రైవ్ శానిటేషన్,డ్రై డే మరియు దోమ లార్వాలను నివారించడానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.సురేందర్ మాట్లాడుతూ పరిసరాల పారిశుధ్యం,దోమల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ రోగాల బారిన పడకుండా చూసుకోవాలని కోరారు.ప్రస్తుత వర్షాకాలంలో తీవ్రంగా వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా,బోదకాలు,మెదడువాపు, హెపటైటిస్ బి కామెర్లు,టైఫాయిడ్ పలు రకాల వ్యాధులను అరికట్టడానికి పరిశుభ్రమైన నీరు, ఆహారం, పారిశుద్ధ్యంతోనే జబ్బుల నివారణకు సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.గృహాల మధ్య ఖాలి స్థలాల్లో చెత్త వేయరాదు, పెంటకుప్పలు లేకుండా చేయాలి,మరుగు దొడ్ల గాలి గోట్టాలకు జాలిలు అమర్చాలి,ఏడీస్ ఈజిప్టీ దోమ మంచినీళ్లలోనే పెరుగుతుంది కాబట్టి ఇది డెంగ్యు జ్వరాన్ని కలగజేస్తుంది దోమల పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి దోమతెరలను వాడాలి.అన్ని వార్డుల్లో ఆశ వర్కర్లతో ఫీవర్ సర్వే నిర్వహించి మందులను పంపినీ చేశారు.దోమల నివారణ కోసం నీటి గుంటలో ఆయిల్ బాల్స్ వేశాము
మురుగు కాలువల్లో టెమిపాస్ ద్రావణాన్ని పిచికారి చెపించాము.కోదాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల జబ్బులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వ్యక్తి గత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ గృహాల్లో దోమల నివారణకోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.వీదులలో బ్లీచింగ్ పౌడర్ చల్లించటం జరిగింది పట్టణంలోని అన్ని వార్డుల్లో నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది.ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆరోగ్య విస్తరణ అధికారి ప్రభాకర్,పబ్లిక్ హెల్త్ నర్స్ వెంకట్రామమ్మ,హెల్త్ అసిస్టెంట్లు
లింగం రామకృష్ణ ,గాంధీ రాజ్. లింగయ్య,సురేష్,కృష్ణ మూర్తి,యాతాకుల మధు బాబు,ఆరోగ్య కార్యకర్తలు,ఏఎన్ఎం లు కల్పన,రజియా,కల్యాణి,ఆశా వర్కర్లు,
మున్సిపాలిటీ సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular