పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు బియ్యం అందజేత
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):ఉన్నత చదువులు చదివి నప్పటికీ ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలలో సరి అయిన ఉద్యోగ అవకాశాలు లేక అద్దె ఆటో నడుపుకుంటున్న దానవీర కు పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు బియ్యం అందజేత..ఈ సందర్భంగా యస్ యస్ రావు మాట్లాడుతూ రెడ్లకుంట గ్రామస్థుడు దానవీర 3 పిజీలు చేసినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక అద్దె ఆటో నడుపుకుంటూ ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిని,బియ్యం,నిత్యావసరాలు తడిచి పాడయిపోయిన విషయాన్ని తెలుసుకున్న పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు,ఫౌండేషన్ సభ్యులు యన్ ఆర్ ఐ (లండన్) నకిరికంటి సత్య కిరణ్ అర్చన దంపతుల సహకారం తో శనివారం నాడు కోదాడ లోని యస్ యస్ రావు స్వగృహంలో దానవీర కు బియ్యం,నిత్యావసరాలు అందించారు.