బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో,పౌర సంస్థలు,వర్తక యూనియన్స్ పాత్ర
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో,పౌర సంస్థలు,వర్తక యూనియన్స్,ఇతరుల పాత్ర అనే అంశంపై సీఎసిఎల్ గమనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, 22-9-2024, ఆదివారం ఉదయం 11 గంటలకు పెన్షనర్ భవనంలో , గమనం స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అంకతి అనసూర్య అధ్యక్షతన,సెమినార్ నిర్వహించడం జరిగినది.ఈ సెమినార్ని ఉద్దేశించి,క్యాంపెనింగ్ ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్,రాష్ట్ర కన్వీనర్,మహమ్మద్ సలీం పాషా మాట్లాడుతూ బాల బాలికలందరూ విద్యాలయాల్లో ఉండాలని,1989లో యుఎన్ఎ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసిందని వారన్నారు.బడి బయట పిల్లలు ఉండరాదని బాలల అక్రమ రవాణాను అరికట్టాలని,ఎక్కువగా బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కుటుంబాల పిల్లలు బీడీ బేకరీ రైస్ మిల్స్ కొన్ని కారణాల వల్ల,సిమెంటు,బహోటల్స్ లాంటి కార్ఖానాల్లో పనిచేస్తున్నారని, వారి కుటుంబాలు పేదరికంలో నిరక్షరాస్యత వీటి కారణంగా పిల్లలని బడికి పంపకుండా పనికి పంపుతున్నారని వారన్నారు.ఇలాంటి వారికి ప్రభుత్వం చేయూతనిచ్చి వారి కుటుంబాల్లోనే పిల్లలను బడిబాటబట్టే ప్రయత్నం చేయాలని వారు అన్నారు.అంకతి అనసూయ మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాల్లో బాల కార్మికులు ఇంకా నూటికి 30% మంది ఉన్నారని అలాగే వీరు కార్మికులుగా మారటానికి వారి కుటుంబాల ఆర్థిక వెసులుబాటు నిరక్షరాస్తే కారణమని వారన్నారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడు గూడు నీడ లేక నిరుపేదలు లక్షల సంఖ్యలో ఉన్నారని ఇంకా గ్రామీణ ప్రాంతాలలో మధ్యము,గంజాయి ఇతర సాంఘిక దురాచారాలకు అలవాటు పడుతున్నారని వారిలో 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారని దీన్ని నిర్మూలించడంలో స్వచ్ఛంద సంస్థలకు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సహకరించాలని అప్పుడే ఈ వ్యవస్థను నిర్మూలించగలుగుతామని వారన్నారు
ఈ సెమినార్ ఉద్దేశించి ఫర్ యాక్షన్ డెవలప్మెంట్ సంస్థ హరి ప్రసాద్,శ్రీనివాస్,వెంకటేష్,జన విజ్ఞాన వేదిక చందా శ్రీనివాస్,టీచర్ బడుగుల సైదులు,టీచర్ బంగారు నాగమణి ,సోషల్ వర్కర్ ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి ఉస్తేల సృజన,రిటైర్డ్ టీచర్స్ స్వామి,హ్యూమన్ రైట్స్ శివ పార్వతి,సోషల్ వర్కర్ మునీర్,తిరుమలగిరి విజయ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని మాట్లాడారు.