గల్లి రోడ్డు సమస్యలతో చింత?
:పారిశుద్ధ్యని మరిచిన అధికారులు
:అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
:శాశ్వత పరిష్కారంలో విఫలం చెందిన మున్సిపల్ అధికారులు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 23:సెప్టెంబర్ నెల ఒకటో తారీకు వచ్చిన వరదలకు కోదాడ పట్టణంలో ప్రజలు నానా ఇబ్బందులు పడి ఇద్దరు మృతి చెందిన విషయము తెలిసినదే.ఆ వరదల సమయంలో చాలావరకు రోడ్లు డ్రైనేజీలు దెబ్బతిన్నాయి వాటిని మరమ్మతులు చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని పట్టణ ప్రజలు వాపోతున్నారు.పట్టణంలోనే 19వ వార్డులో ముడియాల భరత్ రెడ్డి ఆర్చి వీధిలో రఫీ బైక్ మెకానిక్ పక్క గల్లీ రోడ్డు కొద్ది చిన్న వర్ష పడిన ఆ రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ ఆ చుట్టుపక్కల ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుంది.అయినప్పటికీ ఎందరో మున్సిపల్ అధికారులు వచ్చి చూసి వెళ్ళినారు.ఈ మధ్యకాలంలో అంటే వర్షాల కంటే ముందు మున్సిపల్ చైర్ పర్సన్ కూడా చూసి వెళ్లారు.కానీ అక్కడ ఎలాంటి మరమ్మతులు ఇంతవరకు జరగకపోగా ఆ రోడ్డుపై చేరిన మురుగునీరు తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.ఆ నీరు వలన చుట్టుపక్కల నివసించే ప్రజలకు దుర్గంధం వాసన తో ఇబ్బంది పడుతూ దోమల బెడద కూడా ఎక్కువగా ఉన్నదని ప్రజలు వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి ప్రవహించకుండా శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించాలని అంటున్నారు.