తిర్మలగిరి (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తిరుమలగిరి మండల x రోడ్ల బ్రిడ్జి నిర్మాణం నిలిపి వేసి బైపాస్ వేయాలిని నిరసన కార్యక్రమం చేపట్టి నేషనల్ హైవే అధికారులకి తిరుమలగిరి ప్రజలు, అఖిలపక్షాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అఖిల పక్షం నాయకులు, ప్రజలు మాటలాడుతూ తిరుమలగిరి పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నేషనల్ హైవే అథారిటీ చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల వందలాదిమంది చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం నిలిపివేసి బైపాస్ ఏర్పాటు చేసి తిరుమలగిరిలో బతుకుతున్న కుటుంబాలను కాపాడాల్సినవసరం ఉంది.ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల సుధాకర్ లు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.