ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Mbmtelugunews//కూకట్‌పల్లి,సెప్టెంబర్ 27 (తోట కమలాకర్):హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ కి చెందిన షణ్ముఖ చారికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ -ఎల్ఓసి ద్వారా మంజూరైన 2,50,000 /- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ -ఎల్ఓసి మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి అందచేసిన పిఎసి చైర్మన్,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు.ఎవరైనా పేదవారు అనివార్య పరిస్థితులలో ప్రవేట్ ఆసుపత్రులలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారికోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ కు ధీటుగా వైద్యసేవలు అందిస్తున్నారని,ఈ సేవలను పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయినేని చంద్రకాంత్ రావు ఉన్నారు.