ప్రభుత్వ పాఠశాలలో విద్య,మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తా:ఎంఈఓ ఉపేందర్ రావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):నడిగూడెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ సారిస్తానని మండల విద్యాధికారి ఉపేందర్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రం నందు నూతన మండల విద్యాధికారిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.బాధ్యతలు చేపట్టిన ఎంఈఓను సిబ్బంది సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభన్ బాబు,మీరాజుద్దీన్ కార్యాలయ సిబ్బంది నాగరాజు,ఎల్డిఏ రాజశేఖర్ రెడ్డి,సిఆర్పి లు రామారావు,గురుస్వామి,మెసెంజర్ అంజన్ గౌడ్,విశ్రాంత ఉపాధ్యాయులు అప్పారావు,ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.