పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత.
:మహిళా పారిశుద్ధ్య కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
Mbmtelugunews//కూకట్‌పల్లి,సెప్టెంబర్ 27(తోట కమలాకర్):నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,మునిసిపల్ కమీషనర్ డి సౌజన్య పర్యవేక్షణలో నిజాంపేట్ మునిసిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా 2024 భాగంగా మమత హాస్పిటల్ & డాక్టర్ సరళ హోమియో క్లినిక్ వారు మున్సిపల్ మహిళా కార్మికులకు వైద్యపరీక్షలను నిర్వహించారు.ఈ శిబిరంలో వివిధ స్థలాల నుంచి వొచ్చిన మమత హాస్పిటల్ డాక్టర్లు రష్మీ,విపంచి,ప్రీతీ,సాయి పూజిత, డాక్టర్ సరళ హోమియో క్లినిక్ డాక్టర్లు ఎమ్ విజయలక్ష్మి, సరళ కుమారి హాజరై ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ సీఈవో శ్రీవిద్య,మేనేజర్ ఆంజనేయులు,మునిసిపల్ అధికారులు ఎస్ఈ సత్యనారాయణ,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సుకృత రెడ్డి,సీనియర్ అసిస్టెంట్ ప్రార్ధబ్ సింగ్,నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్లు,తదితరులు పాల్గొన్నారు.