ప్రజా పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: వివి రామచందర్ రావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపీడీవో వి వి రామ్ చందర్ రావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయం అని అన్నారు.తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు అని గుర్తుచేశారు.దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి,మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలి,తెలంగాణ త్యాగశీలుల్లో ప్రథమంగా నిలిచే వ్యక్తి బాపూజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాండురంగన్న తదితరులు పాల్గొన్నారు.