వేణుమాధవ్ యాదిలో
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 28 (ప్రతినిధి మాతంగి సురేష్) కోదాడలోని “తెర” సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో సినీ హాస్య నటుడు,కోదాడ నివాసి వేణుమాధవ్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…. తెర సాంస్కృతిక కళామండలి గౌరవ సలహాదారులు పార సీతయ్య పాల్గొని వేణుమాధవ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి,నివాళులర్పించారు.తదనంతరం ఆయన మాట్లాడుతూ… కోదాడ పట్టణంలో వాడ వాడ వేణుమాధవ్ అడుగుజాడలు కనిపిస్తాయని,అంతేకాకుండా తన భావ భావాల చేత,మిమిక్రీ చేత,నటనతో అందరిని కడుపుబ్బ నవ్వించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రుడయ్యాడు అని ఆయన అన్నారు.దాదాపు 500కు పైగా సినిమాలలో నటించి అనేక అవార్డులు,సన్మానాలు పొంది రాష్ట్రానికి పేరు తీసుకువచ్చి, కోదాడ పేరుని ఉచ్చస్థితిలో నిలిపాడని అన్నారు.వేణు భౌతికంగా లేకపోయినప్పటికీ తన నటించిన సినిమాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఆయన గుర్తు చేసుకున్నారు.వేణుతో తన ప్రస్థానం 35 సంవత్సరాల పై మాటే అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.మరో ముఖ్య అతిథి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… వేణుమాధవ్ తో కేఆర్ఆర్ కళాశాలకు విడదీయరాని అనుబంధం ఉందని,కళాశాలలో చదివేటప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికలలో హుషారుగా తన ఆటపాటలతో అందరిని అలరించేవాడని,ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి నటనలో తనదైన శైలిలో రాణించి నంది అవార్డును పొందడం మా అందరికీ గర్వ కారణం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళామండలి సభ్యులు షేక్ మీరా,కోలా శ్రీనివాసరావు,తోట రంగారావు,బూర సైదారావు,మాలోతు సైదానాయక్, షేక్ యాకూబ్,పాలూరి సత్యనారాయణ,చలిగంటి రామారావు,గార్లపాటి వీరారెడ్డి,సుంకర సత్యనారాయణ,బుడిగం నరేష్, సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి,దర్శకుడు తిరూప్,సంగీత దర్శకుడు కొండలు,పబ్బా గీత,ఓరుగంటి రమాదేవి,నామా నరసింహారావు,నవీన్ నాయక్,గోపి నాయక్,చెన్న లక్ష్మి,షేక్ రజియా,షేక్ రిజ్వానా,కనకం సైదులు తదితరులు పాల్గొన్నారు.